ఉల్లాస్‌తో అక్షర వెలుగులు | - | Sakshi
Sakshi News home page

ఉల్లాస్‌తో అక్షర వెలుగులు

May 19 2025 2:12 AM | Updated on May 19 2025 2:12 AM

ఉల్లా

ఉల్లాస్‌తో అక్షర వెలుగులు

కెరమెరి(ఆసిఫాబాద్‌): రాష్ట్రంలో వందశాతం అక్షరా స్యత సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాయి. ఇందుకు నూతన విద్యావి ధానం–2020లో భాగంగా ‘ఉల్లాస్‌’ (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ ఆన్‌ ఇన్‌ది సొసైటీ) అనే నూతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాయి. గతంలో ఉన్న సాక్షరభారత్‌ స్థానంలో దీనిని అమల్లోకి తె చ్చింది. బడిబయటి పిల్లలను పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించనుంది. సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు చదవడం, రాయడం నే ర్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించింది. జిల్లా, మండల, పాఠశా ల స్థాయిల్లో కార్యక్రమాన్ని జూన్‌ నుంచి అమలు చే యనుంది. ఇప్పటికే సంబంధిత అధికారులకు శిక్షణ ఇవ్వగా.. ఈ నెల 20న గ్రామసభలు నిర్వహిస్తా రు. 21నుంచి 25 వరకు గ్రామాల్లో సర్వే నిర్వహించి ఏ స్థాయిలో.. ఎందరు నిర్లక్షరాస్యులున్నారు.. పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిల్లో ఎందరున్నారు..? అనే విషయాలను సేకరిస్తారు.

ఓపెన్‌ స్కూలింగ్‌ ద్వారా బోధన

కేంద్ర ప్రభుత్వం 2009లో సాక్షరభారత్‌ కార్యక్రమాన్ని పదేళ్ల కాలపరిమితితో ప్రారంభించగా 2018 లోనే ముగిసింది. ఆ తర్వాత 2020లో కొత్త విద్యావిధానం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా అందరికీ విద్య అందించేందుకు 2022నుంచి 2027 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు న్యూఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ) లో భాగంగా డిపార్టమెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ లిటరసీ ‘ఉల్లాస్‌’కు రూపకల్పన చేసింది. ప్రాథమిక, ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యత క ల్పించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ, కుటుంబ సంక్షేమంపై అవగాహన, జీవన నైపుణ్యాలు పెంపొందించి తద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడ మే లక్ష్యంగా ఉల్లాస్‌ను తెచ్చింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాల్లోనూ కార్యాచరణ ప్రారంభమైంది. 100శాతం అక్ష్యరాస్య త సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా 14 ఏళ్ల వ యస్సు పైబడిన వారిని, డ్రాపౌట్స్‌, బడీడు పిల్లల ను గుర్తించి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌)లో ప్రవే శం కల్పిస్తారు. పరీక్షలు రాయించి ఉత్తీర్ణులయ్యేలా చూస్తారు. 15 ఏళ్లు పైబడిన వారిని ఓపెన్‌ ఇంటర్‌లో జాయిన్‌ చేయించి ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీ సుకుంటారు. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకూ చదవడం, రాయడం నే ర్పిస్తారు. త్వరలో ఇన్‌స్ట్రక్టర్లను నియమిస్తారు.

ప్రత్యేక యాప్‌ రూపొందించి..

ఉల్లాస్‌ కార్యక్రమం అమలుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించారు. డీఆర్డీవో ద్వారా సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. సులభంగా చదవడం, రాయడం నేర్పించేందుకు ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ‘అక్షర వాచకం’ పుస్తకాన్ని త్వరలో రూపొందించనున్నారు.

రోజుకు రెండు గంటల చొప్పున..

నిరక్షరాస్యులకు రోజులో రెండు గంటల చొప్పున 200 గంటలు బోధిస్తారు. తరగతుల నిర్వహణకు పాఠశాలలు, ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లను గుర్తించి డిజిటల్‌ కంటెంట్‌తో కంప్యూటర్‌, టీవీలను సమకూర్చనున్నారు.

జిల్లా నిరక్షరాస్యులు

కు.ఆసిఫాబాద్‌ 22,494

ఆదిలాబాద్‌ 26,312

నిర్మల్‌ 31,323

మంచిర్యాల 30,636

జిల్లాల వారీగా

నిరక్షరాస్యుల వివరాలు

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యం

జిల్లా వ్యాప్తంగా 20న గ్రామసభలు

21 నుంచి 25 వరకు సర్వే ప్రక్రియ

జూన్‌ నుంచి కార్యక్రమం ప్రారంభం

వందశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం

సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా కార్యాచరణ తయారుచేశాం. ఈ నెల 20న గ్రామసభలు, 21నుంచి 25 వరకు ప్రత్యేక సర్వే నిర్వహిస్తాం. ఇందులో ఏయే స్థాయికి చెందిన వారు ఏమేం చదివి ఉన్నారో గుర్తిస్తాం. పూర్తిస్థాయిలో ఉల్లాస్‌ను విజయవంతం చేసేందుకు మండల, జిల్లా స్థాయి అధికారులను సమన్వయపరుస్తాం. కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలి.

– కటుకం మధూకర్‌, ఉల్లాస్‌

ప్రోగ్రాం అధికారి, కుమురంభీం ఆసిఫాబాద్‌

ఉల్లాస్‌తో అక్షర వెలుగులు1
1/1

ఉల్లాస్‌తో అక్షర వెలుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement