కట్టలేం! | - | Sakshi
Sakshi News home page

కట్టలేం!

May 20 2025 12:20 AM | Updated on May 20 2025 12:20 AM

కట్టలేం!

కట్టలేం!

ఇందిరమ్మ..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం జిల్లాలో అమలు పర్చడానికి హౌసింగ్‌ అధికారులు అపసోపాలు పడుతున్నారు. ‘ప్రజాపాలన’లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసినా.. కొందరు నేటికీ ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడంలేదు. వారిని ఒప్పించడం అధికారులకు ‘కత్తి మీద సాము’గా మారింది. దీంతో జిల్లాలో 749 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి నోచుకోకుండా మిగిలిపోయాయి.

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లాలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రెండు నియోజకవర్గాలకు 7 వేల ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 మండలాల్లో 15 గ్రామ పంచాయతీలను మొదటి దశ కింద ఎంపిక చేసి వాటిలో పైలట్‌ ప్రాజెక్టు కింద 1,669 ఇళ్లు మంజూరు చేశారు. మండలానికి ఒకటి చొప్పున ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మించాల్సి ఉండగా 13 మండలాల్లో పూర్తయ్యాయి. ఒక్కో ఇంటిని 400 చదరపు అడుగుల్లో నిర్మిస్తే రూ.5 లక్షలు ఖర్చవుతుంది. నిర్మాణ పనుల తీరు ను బట్టి నాలుగు విడతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం డబ్బును అందజేస్తుంది. ఇప్పటి వరకు 920 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకొ చ్చారు. ఇందులో 215 ఇళ్లు పునాది దశకు చేరాయి. వీరందరికి మొదటి విడతగా రూ.లక్ష నగదు విడుదల చేశారు.

లబ్ధిదారుల అనాసక్తి...

మొదటి విడతలో జిల్లాకు 1,669 ఇళ్లు మంజూరు కాగా 920 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి అంగీకారపత్రాలు సమర్పించారు. కానీ 749 మంది మాత్రం నేటికీ అంగీకారపత్రాలు అందించలేదు. వెనుకబడిన జిల్లా.. గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతం కావడం వల్ల రూ.5 లక్షలు వెచ్చించి ఇళ్ల నిర్మాణం చేపట్టడం వారికి భారంగా మారింద ని కొందరు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం.. ఇసుక ఆకాశన్నంటి న తరుణంలో అప్పు చేసి ఇళ్ల నిర్మాణానికి పూనుకు న్న తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా ఉంటే మా పరిస్థితి ఏమిటన్న వాదన కూడా ఉంది. లబ్ధి దారుల అనుమానాలపై హౌసింగ్‌ అధికారులు స మాధానం ఇవ్వడమే కాకుండా.. స్వయం సహాయ క సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి.. వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక అటవీ అధికారులు అడ్డుకోవడడంతో బెజ్జూరు మండలం సుశ్మీర గ్రామం, సిర్పూరు (టి) మండంలోని రావణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలు ఆగిపోయాయి. లబ్ధిదారులు మొదటిస్థా యి (ఎల్‌–1) కింద చూపిన స్థలాలు అటవీశాఖ ప రిధిలోకి వస్తాయని పేర్కొంటూ స్థానిక అటవీ అధి కారులు అక్కడ ఇళ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు.

జిల్లాలో ‘ఇందిరమ్మ’ పథకం అమలవుతున్న జీపీలు

మండలం గ్రామ పంచాయతీ

ఆసిఫాబాద్‌ గోవిందాపూర్‌

వాంకిడి జైత్‌పూర్‌

కెరమెరి కోటారి

జైనూర్‌ మార్లవాయి

సిర్పూరు(యు) పులార

లింగాపూర్‌ జముల్‌దర

తిర్యాణి రొంపల్లి

రెబ్బెన పాసిగాం

కాగజ్‌నగర్‌ మాలిని

సిర్పూర్‌(టి) మేడిపల్లి

దహెగాం డిగడ

పెంచికల్‌పేట్‌ లోడుపల్లి

బెజ్జూర్‌ సుశ్మీర

చింతలమానెపల్లి బాబాపూర్‌

కౌటాల నాగేపల్లి

దశల వారీగా నిర్మాణ చెల్లింపులు ఇలా...

పునాది రూ.లక్ష

రూఫ్‌ లెవల్‌ రూ.1.25 లక్షలు

స్లాబ్‌ రూ.1.75 లక్షలు

పెయింటింగ్‌ పూర్తయ్యాక రూ.లక్ష

పైలట్‌ ప్రాజెక్టు గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక

ఇళ్ల నిర్మాణానికి ముందుకురాని వైనం..

నేటికీ అంగీకారం తెలుపని 749 మంది..

రుణాలిప్పిస్తామంటున్న హౌసింగ్‌ అధికారులు

రెండు గ్రామాల్లో అటవీ అధికారుల అభ్యంతరం

అవగాహన కల్పిస్తున్నాం..

జిల్లాలో మొదటి దశలో 749 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లే దు. వారికి అవగాహన కల్పిస్తున్నాం. ఆర్థికభారం పడకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా రుణా లు ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. అయినా ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోతే షోకాజ్‌ నోటీసు జారీ చేసి అర్హుల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తాం. రెండో దశ అర్హుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.

– ఆర్‌.వేణుగోపాల్‌,

ప్రాజెక్టు ఆఫీసర్‌, హౌసింగ్‌ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement