
విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
కెరమెరి: నెలరోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని వార్డు నెంబర్ 1 కి చెందిన వినియోగదారులు సోమవారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోతోందన్నా రు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడంలేదన్నారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్‌కు వచ్చినప్పటికీ బాధ్యత గల అధికారులెవరూ లేరన్నారు. స్థానికంగా ఉండాల్సిన అధికారులు జిల్లా కేంద్రాల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఏఈ రమేశ్ రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సుధాకర్, ఫాజిల్, ఇలి యాజ్, అహ్మద్, పోషెట్టి, తదితరులు పాల్గొన్నారు.