
సిబిల్ స్కోర్ నిబంధన వద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు మంజూరు చేసేందుకు విధించిన సిబిల్ స్కోర్ నిబంధన వెనక్కి తీ సుకోవాలని జాతీయ మానవ హక్కుల కమి టీ జిల్లా చైర్మన్ రమేశ్ కోరారు. శనివారం జి ల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రాజవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం హర్షణీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండు ద ఫాలుగా మాత్రమే రుణాలు అందించారని, పదేళ్లలో నిరుద్యోగ యువకులు ఎలాంటి ఉ పాధి లేకుండా నష్టపోయారని తెలిపారు. రా జీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన విధించడంతో మారుమూల గ్రా మాలకు చెందిన పేద యువకులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా సిబిల్ స్కోర్ నిబంధన ఉపసంహరించుకోవాలని, అర్హుల జాబితా పకడ్బందీగా రూపొందించాలని డిమాండ్ చేశారు.