వేసవి వేడి.. ఒంటిపూట బడి | - | Sakshi
Sakshi News home page

వేసవి వేడి.. ఒంటిపూట బడి

Mar 14 2025 1:52 AM | Updated on Mar 14 2025 1:47 AM

● ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు ● ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 23 వరకు అమలు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● ‘పది’ పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి స్కూళ్లు

కెరమెరి(ఆసిఫాబాద్‌): మార్చిలోనే భానుడు తన ప్ర తాపం చూపుతున్నాడు. ఎండల తీవ్రత పెరిగిన నే పథ్యంలో ఈ నెల 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించనున్నారు.

జిల్లాలో 1,273 పాఠశాలలు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఆశ్రమ, ఆదర్శ, గురుకులాలు, కేజీబీవీలు మొత్తం 1,273 పాఠశాలలు ఉ న్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆయా స్కూళ్లలో 98వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యాన్లు లేవు. నల్లాలు ఏర్పాటు చేసినా భగీరథ నీటి కనెక్షన్‌ ఇవ్వలేదు. ఎండల తీవ్రత పెరగడంతో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. డీహైడ్రేషన్‌, వడదెబ్బ, నీరసంతో అనారోగ్యం బారిన పడతారు. ఎండ, వేడి కారణంగా అలసటకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రభుత్వం వేసవిలో ఒంటిపూట బడులు నిర్వహిస్తుంది.

21 నుంచి ‘పది’ వార్షిక పరీక్షలు

ఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రా రంభం కానున్నాయి. జిల్లాలోని 174 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చే యనున్నారు. ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేసిన ఉ న్నత పాఠశాలల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకా రం ఏప్రిల్‌ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు.

మోడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థినులు

పాఠశాలల పనివేళలు ఇలా..

మొదటి గంట ఉదయం 8 గంటలు

రెండో గంట ఉదయం 8:05 గంటలు

ప్రార్థన ఉ.8:05 నుంచి 8:15

మొదటి పీరియడ్‌ 8:15 నుంచి 8:55

రెండో పీరియడ్‌ 8:55 నుంచి 9:35

మూడో పీరియడ్‌ 9:35 నుంచి 10:15

స్వల్ప విరామం 10:15 నుంచి 10:30

నాలుగో పీరియడ్‌ 10:30 నుంచి 11:10

ఐదో పీరియడ్‌ 11:10 నుంచి 11:50

ఆదో పీరియడ్‌ 11:50 నుంచి మధ్యాహ్నం 12:30

జాగ్రత్తలు తీసుకోవాలి

ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎండల నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలి.

– యాదయ్య, జిల్లా విద్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement