సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

Mar 12 2025 7:59 AM | Updated on Mar 12 2025 7:54 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ పేరును నామకరణం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద పద్మశాలీ సేవా సంఘం సభ్యులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లా అధ్యక్షుడు ఇరుకుల ఆంజనేయులు మాట్లాడుతూ వాంకిడి మండల కేంద్రానికి చెందిన కొండాలక్ష్మణ్‌ బాపూజీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులు సైతం లెక్కచేయలేదన్నారు. వాంకిడిలో సేవాసదన్‌ సంస్థకు చెందిన భూమిలో బాపూజీ స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎమ్మెల్సీ దండె విఠల్‌ రూ.30లక్షలు కేటాయించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌, శ్రీకాంత్‌, లింగయ్య, పుష్పలత, సునీత, ఇరుకుల మంగ, ప్రణయ్‌, భద్రయ్య, శ్యాం, శైలేందర్‌, శ్రీనివాస్‌, ధర్మయ్య, సత్యనారాయణ, మహేష్‌, మాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగోసె శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement