కెరమెరి(ఆసిఫాబాద్): పదో తరగతి విద్యార్థులు వా ర్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఏటీడీవో శ్రీనివాస్ అన్నారు. మండలంలో ని జోడేఘాట్, బాబేఝరి, హట్టి ఆశ్రమ పాఠశాలలను సోమవా రం సందర్శించారు. పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలకు పరిశీలించారు. వార్షిక పరీక్షలకు పది రోజులే గడువు ఉన్నందున కష్టపడి చదవాలన్నారు. ఉపాధ్యాయులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని సూచించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు మోతీరాం, జంగు, పంచఫుల తదితరులు ఉన్నారు.