రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని గోలేటి గ్రామ శివారులో గల శ్రీ భీమన్న ఆలయంలో ఆదివారం జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భీమన్న దేవుడిని దర్శించుకునేందుకు వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు కోళ్లు, మేకలు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాల్లో వనభోజనాలు చేశారు. సాయంత్రం భీమన్న దేవుడి రథోత్సవం నిర్వహించారు. భీమన్న ఆలయంలో మొదటిసారిగా జాతర మహోత్సవం నిర్వహించగా, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. జాతరలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన పులిహోర పంపిణీని ఎస్సై చంద్రశేఖర్ ప్రారంభించారు.
ఘనంగా గోలేటి భీమన్న జాతర