ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యం

Mar 4 2025 12:37 AM | Updated on Mar 4 2025 12:34 AM

● ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్‌ ధమ్మ సారథి

వాంకిడి: ప్రపంచ శాంతికి గౌతమ బుద్ధుడు చూపించిన బౌద్ధ మార్గమే శరణ్యమని ఆలిండియా భిక్కు సంఘం ప్రధాన కార్యదర్శి భంతే భదంత్‌ ధమ్మ సారథి అన్నారు. మండల కేంద్రంలోని జేత్వాన్‌ బుద్ధ విహార్‌లో భారతీయ బౌద్ధ మహాసభ, అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ధమ్మ దీక్ష శ్రామ్‌నేర్‌ శిబిర్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువులు భంతే వివేక్‌, రాహుల్‌ బోధి, నిబ్బాన్‌లతో కలిసి బౌద్ధ సూత్రోచ్ఛరణలు ప్రభోదించి దీక్ష స్వీరించేందుకు ముందుకొచ్చిన 30 మందికి కాషాయ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బౌద్ధం అనేది మతం కాదని, ప్రపంచ శాంతికి మార్గం అన్నారు. ప్రజ్ఞా, శీలం, కరుణ అనే అంశాలపైనే మనిషి జీవన శైలి ఆధారపడి ఉంటుందన్నారు. 1956 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ లక్ష మందితో కలిసి నాగ్‌పూర్‌ పట్టణంలో బౌద్ధాన్ని స్వీకరించారని, శాంతిని బోధిస్తూ, అస్పృశ్యతకు అవకాశం లేకుండా సమ సమాజ నిర్మాణానికి, మూఢ నమ్మకాలను విడనాడేందుకు బౌద్ధం ఒక సూచికలా ఉపయోగపడుతుందన్నారు. అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిస్తూ బౌద్ధాన్ని ఆచరించాల్సిన అవసరం నేటి ప్రపంచానికి ఎంతైనా ఉందన్నారు. అంతకు ముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్‌ మహోల్కర్‌, ఉపాధ్యక్షుడు వినేష్‌ ఉప్రే, మండల అధ్యక్షుడు జైరాం ఉప్రే, అంబేద్కర్‌ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్‌, నాయకులు విలాస్‌ ఖోబ్రగడె, రాజేంద్ర ప్రసాద్‌, హంసరాజ్‌, రోషన్‌, విఠల్‌, విజయ్‌ ఉప్రే, నాగ్‌సేన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement