
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవ లక్ష్మి మొత్తం ఆస్తి విలువ రూ.1,18,80,862, ఉన్న ట్లు గురువారం సమర్పించిన ఎన్ని కల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వద్ద రూ.2 లక్షలు, భర్త సోనేరావు వద్ద రూ.50 వేల నగదు ఉన్నట్లు వివరించారు. రూ.80,50, 862 స్థిరాస్తులు, రూ.38,30,000 విలువైన చరాస్తులు, రూ.42,50,862 విలువైన బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. భర్త సోనేరావు పేరుతో రూ.1,14,54,291 ఆస్తి ఉండగా ఇందులో రూ.18,24,391 విలువైన స్థిరాస్తి, రూ.96,30,000 విలువైన చరాస్థి ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.20 లక్షల విలువైన ఇన్నోవా, రూ.18 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
భర్త పేరుతో రూ.13 లక్షల విలువైన బొలేరో వాహనం, రూ.2.40 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. తన పేరుతో మహేంద్ర అండ్ మహేంద్రలో రూ. 8 లక్షల రుణం, సోనేరావు పేరుతో రూ.6 లక్షల రుణం ఉన్నట్లు పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో కోవ లక్ష్మి వద్ద రూ.లక్ష నగదు, సోనేరావు వద్ద రూ.10 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. రూ.21 లక్షల విలువైన స్థిరచరాస్తులు, భర్త సోనేరావు పేరుపై రూ.50 వేల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. కోవ లక్ష్మి పేరుమీద 3.25 ఎకరాలు, సోనేరావు పేరుమీద 5.30 ఎకరాలు, నివాస భవనం ఉన్నట్లు పేర్కొన్నారు.