త్వరలో ‘గృహలక్ష్మి’ విధివిధానాలు ప్రకటిస్తాం
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తు విధివిధానాలను త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ హేమంత్ బోర్కడే తెలిపారు. ఈ పథకం విధివిధానాలు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారం నమూనా ప్రకటించిన తర్వాత వివరాలు వెల్లడిస్తామన్నారు. జిల్లాలోని లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
జాబితా విడుదల
ఆసిఫాబాద్‌అర్బన్: సమగ్ర శిక్ష కార్యక్రమంలో ఎంఐఎస్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, ఐఈఆర్పీల నియమానికి సంబంధించి తాత్కాలిక ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు డీఈవో అశోక్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంతోపాటు జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్ https:// deokbasf.weebly.comలో జాబితాను అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు గురువారం సాయంత్రం 5 గంటల లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.