
మాట్లాడుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి
ఆసిఫాబాద్: బీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. లింగాపూర్ మండలం పిట్టగూడలో బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు మాట్లాడుతూ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, లింగాపూర్ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్, ఎంపీపీ సవిత, జెడ్పీటీసీ రక్కబాయి, వైస్ ఎంపీపీలు ఆత్మారాం, ఆత్రం ప్రకాశ్, జైనూర్ ఏఎంసీ చైర్మన్ భగవంత్‌రావు, నాయకులు ధర్మారావు, ఇంతీయాజ్ లాలా తదితరులు పాల్గొన్నారు.