
విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
దహెగాం(సిర్పూర్): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. దహెగాం మండలంలో బుధవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున సెల్‌ఫోన్లు దూరం పెట్టి చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలకు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. నర్సరీని పరిశీలించి ఏఏ మొక్కలు పెంచుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఎంపీడీవో, ప్రాథమిక పాఠశాల, బీబ్రా ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక పాఠశాల స్థలం అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మించాలని ఆదేశించారు. ఎంపీడీవో రాజేశ్వర్, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ప్రిన్సిపాల్ అమరేందర్, పీఆర్ ఏఈ ఆత్మారాం, పంచాయతీ కార్యదర్శి ప్రణీత్‌బాబు, ఉపాధ్యాయులు ఉన్నారు.
విద్యార్థులకు పాఠాలు బోధన
మండల పర్యటనలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఉపాధ్యాయురాలిగా మారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.