
మాట్లాడుతున్న మోతె రాజలింగు
పాతమంచిర్యాల: కేంద్ర ప్రభుత్వం ఔషధాల ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైట్ టూ హెల్త్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మోతె రాజలింగు డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య చికిత్సల్లో రోగులకు ఉపశమనం కలిగించే ఔషధాల ధరలను ఏప్రిల్ మాసం నుంచి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన లక్షలాది మంది పేదలపై భారం పడుతోందన్నారు. మందుల ధరల పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖకు వినతిపత్రం పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోశం, చిరంజీవి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.