
పట్టణంలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు
2
పట్టణాభివృద్ధికి సహకరించాలి
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గృహాలు, వాణిజ్య సముదాయాల యజమానులు సకాలంలో ఆస్తి పన్నులు, నల్లా బిల్లులు చెల్లించి పట్టణావృద్ధికి సహకరించాలి. వంద శాతం పన్నులు వసూళ్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఆరు టీంలు నిరంతర ఆస్తి పన్నుల వసూళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. మిగిలిన మూడు రోజుల్లో ఆశించిన స్థాయిలో ఆస్తి పన్నుతోపాటు నల్లా బిల్లులను వసూలు చేస్తాం. పట్టణ ప్రజలు ఆస్తి పన్నుపై ఎలాంటి వడ్డీ లేకుండా సకాలంలో చెల్లించాలి.
– అంజయ్య, కమిషనర్,
కాగజ్‌నగర్ మున్సిపాలిటీ
