మందమర్రిరూరల్: మందమర్రి పోలీస్‌స్టేషన్ పరిధి మూడో జోన్ పోచమ్మ గుడి సమీపంలోని తన ఇంట్లో పిట్టల కుమార్ (38) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై చంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమార్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న తల్లి అనసూ ర్య సోమవారం రాత్రి పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. మంగళవారం ఉదయం అనసూ ర్య ఇంటికి రాగా కుమార్ చీరెతో ఉరేసుకుని మృతి చెంది కనిపించాడు. పెళ్లి కావడంలేదని మనస్తాపం చెంది కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. అనసూర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.