
విలేకరులతో మాట్లాడుతున్న సీఐ మహేందర్‌రెడ్డి
కాసిపేట: మండలంలోని దేవాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తంగళ్లపల్లి–కోనూరు గ్రామానికి చెందిన దుంపటి మహేశ్‌ను హత్య చేసిన అతడి భార్య లావణ్యను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం దేవాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్యకు 14 ఏళ్ల క్రితం మహేశ్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మహేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసై లావణ్యను హింసిస్తున్నాడు. దీంతో లావణ్య గతంలో రెండుసార్లు కట్టెతో మహేశ్‌పై దాడి చేసింది. భర్త పెట్టే హింస భరించలేక ఎలాగైనా అతడిని చంపాలని అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ నెల 26న సాయంత్రం మహేశ్ తాగి వచ్చి లావణ్యతో గొడవపడ్డాడు. దీంతో ఇదే సరైన సమయంగా భావించిన లావణ్య ఇనుప రాడ్‌తో మహేశ్ తలపై బలంగా కొట్టింది. తల పగలగా తీవ్ర రక్తస్రావమై మహేశ్ మృతి చెందాడు. విచారణ చేపట్టిన పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎస్సై విజయేందర్ పాల్గొన్నారు.