సత్తుపల్లిటౌన్: అంతరించి పోతున్న హస్తకళల నిపుణులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ అన్నారు. సత్తుపల్లి ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో సోమవారం కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. డాక్టర్ మట్టా దయానంద్, మేనేజర్ ఎస్.రాజేష్, ప్రవీణ్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఎండీ రెహానా కమల్‌పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత, గాదె చెన్నారావు, వెంకటనారాయణరెడ్డి, హెచ్‌ఎం నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్లు, దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజ, పింగళి సామేలు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మంమయూరిసెంటర్: మైనారిటీ మహిళలకు అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముహమ్మద్ ముజాహిద్ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, సిక్కు, జైన, బౌద్ధ, పార్సీ మైనారిటీ మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులని, ఇతర వివరాలకు 97040 03002 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
నిరుద్యోగులకు
రైసెట్ కేంద్రంలో..
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని వరంగల్‌క్రాస్ రోడ్‌లో ఉన్న రైసెట్ కేంద్రంలో నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రైసెట్ మేనేజర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యూటీపార్లర్, టైలరింగ్, మగ్గం కోర్సులలో నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23, 24వ తేదీల్లో తరుణీ హాట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చెందిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నేటి నుంచి కేంద్రియ
విద్యాలయలో వేసవి శిబిరం
ఖమ్మంరూరల్: పోలేపల్లిలో ఉన్న కేంద్రియ విద్యాలయలోని విద్యార్థులకు నేటి నుంచి ఈ నెల 26 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భారతీయ భాషా వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ కవీంద్రరాయ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో భారతీయ భాషలు, సంస్కృతి, సృజనాత్మకత, సంభాషణా నైపుణ్యాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. భాషా అభ్యసన తరగతులు, కథలు వినిపించడం, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక చర్చలు, జానపద గీతాలు, క్విజ్ వంటి అనేక ఆసక్తికర కార్యక్రమాలు శిబిరంలో ఉంటాయని తెలిపారు.
సర్పంచ్‌లకు అవగాహన
ఖమ్మం సహకారనగర్: ఘన వ్యర్థాల నిర్వహణపై జిల్లాలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో సోమవారం సమావేశం నిర్వహించారు. అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీ సేవలపై పలు సూచనలు చేసినట్లు డీపీఓ రాంబాబు తెలిపారు.


