ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలో పలువురు నాయబ్ తహసీల్దార్‌లకు తాత్కాలికంగా తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అమలుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకోగా, జయశంకర్ భూపాల్‌పల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు చెందిన కె.బ్రహ్మేశ్వరరావు, ఎం.వినయేందర్‌రెడ్డి, డి.జయచందర్‌కు పదోన్నతి కల్పించి జిల్లాకు కేటాయించారు. అయితే, వీరికి పోస్టింగ్ ఇచ్చిన మండలం కాకుండా మరో మండలంలో డిప్యూటేషన్‌పై ఇచ్చారు. అంతేకాక జిల్లాలో ఇంకో ఆరుగురు తహసీల్దార్లకు కూడా స్థానచలనం కల్పించారు. కాగా, సింగరేణి తహసీల్దార్ ఏ.రమేష్ డిప్యూటేషన్‌ను రద్దు చేసి కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిప్యూటేషన్‌పై నియమితులైన తహసీల్దార్లు వెంటనే విధుల్లో చేరాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.
జిల్లాకు ముగ్గురి కేటాయింపు,
మరికొందరికి స్థానచలనం


