ఆ సిగ‘రేటు’.. సపరేటు
విస్తృత తనిఖీలు చేస్తున్నాం..
హైదరాబాద్ నుంచి
దిగుమతి చేసుకుంటున్న వ్యాపారులు
అనుమతి ఉన్న కంపెనీలతో పోలిస్తే
అధిక లాభాలు
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో బయటపడుతున్న దందా
విజయ కళాశాలలో
రూ.7 లక్షల నగదు చోరీ
కొణిజర్ల: మండలంలోని తనికెళ్ల సమీపాన ఉన్న విజయ ఇంజనీరింగ్ కళాశాలలో చోరీ జరిగింది. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి కళాశాలలోకి ప్రవేశించారు. ఆపై ప్రిన్సిపాల్ గదిలోని ఇనుప బీరువా నుంచి తాళాలు పగులగొట్టి రూ.7,07,642 నగదు ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం కాలేజీకి వచ్చిన ప్రిన్సిపాల్ వి.చిన్నయ్య.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జి.సూరజ్ తెలిపారు.
పాఠశాలలో చోరీకి యత్నం
రఘునాథపాలెం: మండలంలోని వీవీపాలెంలో ఉన్న సెడార్ వ్యాలీ పాఠశాలలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి ప్రవేశించినా ఏమీ దొరకకపోవడంతో రూ.3 వేల నగదు చోరీ చేశారు. ఘటనపై పాఠశాల బాధ్యుడు నరేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి నిందితులను ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. ఈ ఘటనకు ముందు వీరు కొణిజర్ల మండలంలోని ఓ కాలేజీలో చోరీ చేసినట్లు నిర్ధారించినట్లు చెప్పారు.
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
ముదిగొండ: పలు గ్రామాల్లో సేకరించిన 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుంటూరు తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం అర్బన్ మండలం నుంచి బియ్యం సేకరించగా, బొలేరో వాహనంలో డ్రైవర్ అభిలాష్ గుంటూరు తరలిస్తున్నాడు. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం వద్ద శనివారం చేపట్టిన తనిఖీల్లో బియ్యాన్ని స్వాధీనం చేసుకోగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హరిత తెలిపారు.
ఎంబీఏలో గోల్డ్ మెడల్
ఖమ్మంసహకారనగర్: ఖమ్మానికి చెందిన పుచ్చకాయల స్పందన హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె జేఎన్‌టీయూ వీసీ చేతుల మీదుగా బంగారు పతకం స్వీకరించింది. స్పందనను బ్రెయిన్ ఫీడ్ ఎడ్యుకేషనల్ సంస్థ సీఈఓ కాకాని వీరబ్రహ్మం, పద్మజ, ఆమె తల్లిదండ్రులు పుచ్చకాయల ప్రభాకర్, విజయలక్ష్మి అభినందించారు.
మిస్ట్ కళాశాల విద్యార్థినికి..
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం విద్యార్థిని జే.ఎస్.శ్రావ్యశ్రీ జేఎన్‌టీయూ నుంచి బంగారు పతకం సాధించిందని ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన జేఎన్‌టీయూ స్నాతకోత్సవంలో ఆమె వీసీ చేతులమీదుగా గోల్డ్ మెడల్‌తో పాటు కే.వీ.రంగారెడ్డి మెమోరియల్ గోల్డ్ మెడల్ కూడా స్వీకరించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రావ్యశ్రీని ప్రిన్సిపాల్‌తో పాటు సెక్రటరీ, కరస్పాండెంట్ చలసాని సాంబశివరావు, అధ్యాపకులు డాక్టర్ ఎంవీ రామచంద్రరావు, డాక్టర్ వై.రాజశేఖర్‌రెడ్డి తదితరులు అభినందించారు.
ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత విదేశీ సిగరెట్ల అమ్మకాలు జోరందుకున్నాయి. పర్యవేక్షించే వారు లేక, తనిఖీలు జరగకపోవడంతో వ్యాపారులు ఇదే అదనుగా విదేశీ సిగరెట్లను తెప్పించి విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఇటీవల పోలీస్, టాస్క్‌ఫోర్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో పలుచోట్ల విదేశీ సిగరెట్లు బయటపడడంతో దందా వెలుగు చూసింది.
కాకినాడ పోర్ట్ టు ఖమ్మం.. వయా హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పోర్ట్‌కు విదేశాల నుంచి వచ్చే ఓడల్లో సిబ్బంది, ఇతరుల ద్వారా అక్కడి వ్యాపారులు విదేశీ బ్రాండ్ల సిగరెట్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీటికి అనుమతి లేకపోగా ఎమ్మార్పీతో పొంతన లేకుండా కొనుగోలు చేస్తారు. ఇంకొన్ని సిగరెట్ ప్యాకెట్లపై ధరలు కూడా ఉండవని తెలిసింది. ఇలా విదేశీ బ్రాండ్ సిగరెట్లను హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఆపై ఖమ్మం వ్యాపారులు తెప్పిస్తున్నారని సమాచారం. మిగతా సిగరెట్ల మాదిరిగా వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోగా, పన్ను చెల్లించకుండా యథేచ్ఛగా దిగుమతి చేసుకుని అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వం వీటి అమ్మకాలను నిషేధించింది.
వ్యాపారులకు లాభాలు
అనుమతి ఉన్న సిగరెట్లపై వ్యాపారులకు తక్కువ లాభం వస్తుండగా, నిషేధిత విదేశీ సిగరెట్లను ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. కొన్నింటికి ధర లేకపోవడంతో వ్యాపారుల రాజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యాన హైదరాబాద్ నుంచి ఇతర సరుకులతో పాటు విదేశీ బ్రాండ్ సిగరెట్లను ఖమ్మంలోని కొందరు వ్యాపారులు తెప్పించి అమ్ముతున్నట్లు తెలిసింది. ఖమ్మం శ్రీనివాస్‌నగర్‌కు చెందిన, గతంలో గుట్కా వ్యాపారంతో సంబంధం ఉన్న ఓ వ్యాపారి విదేశీ బ్రాండ్ సిగరెట్ల దందా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. ఒక్కో బాక్స్‌లో పది సిగరెట్ పెట్టెలు ఉండగా, బాక్స్‌ను బ్రాండ్ ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.10 వేలతో కొనుగోలు చేసి రిటైలర్లకు కొంత లాభంతో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఆపై చిన్న షాప్‌ల వారు ఒక్కో సిగరెట్‌ను రూ.25 నుంచి రూ.30కి అమ్ముతున్నట్లు సమాచారం. తొలుత యువతకుకు శాంపిల్‌గా సిగరెట్ ఇచ్చి ఆపై ఎక్కువ ధరతో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.
నిషేధిత విదేశీ సిగరెట్ల అమ్మకాలను కట్టడి చేసేలా విస్తృత తనిఖీలు చేపడుతున్నాం. వ్యాపారులు అధిక లాభాల ఆశతో వీటిని తెప్పించి అమ్ముతున్నారు. ఈ విదేశీ సిగరెట్లను విక్రయించినా,. దిగుమతి చేసుకున్నా కేసులు నమోదు చేస్తాం. రిటెయిల్‌గా అమ్మే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఎక్కడైనా విదేశీ సిగరెట్లు అమ్ముతున్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి.
–సత్యనారాయణ, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ
నిషేధిత విదేశీ సిగరెట్ల అమ్మకం
ఆ సిగ‘రేటు’.. సపరేటు
ఆ సిగ‘రేటు’.. సపరేటు
ఆ సిగ‘రేటు’.. సపరేటు
ఆ సిగ‘రేటు’.. సపరేటు


