●ఉపసర్పంచ్ పదవి ఇవ్వలేదని ఆందోళన
సత్తుపల్లి: మండలంలోని కిష్టారం గ్రామపంచాయతీ ముందస్తు ఒప్పందం ప్రకారం ఉప సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పడంతో బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకుందని.. కానీ ఇప్పుడు మాట తప్పారంటూ బీఆర్‌ఎస్ వార్డుసభ్యులు, నాయకులు సోమవారం ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్నారు. సర్పంచ్ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి గెలిచిన సర్పంచ్ రాజీనామా చేయాలని పాలకుర్తి రాజు, భిక్షపతి తదితరులు డిమాండ్ చేశారు. అక్కడ ఉధ్రిక్తత నెలకొనడంతో సత్తుపల్లి పట్టణ సీఐ శ్రీహరి చేరుకుని నచ్చజెప్పారు. ఇదిలా ఉండగా ఏకగ్రీవమైతేనే ఉపసర్పంచ్ పదవి ఇస్తామని చెప్పామని, ఎన్నికలు జరిగినందున ఇవ్వలేదని సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి బదులిచ్చారు.


