అనుమతి లేని ఆస్పత్రి సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని ఆస్పత్రి సీజ్‌

Dec 23 2025 6:55 AM | Updated on Dec 23 2025 6:55 AM

అనుమతి లేని ఆస్పత్రి సీజ్‌

అనుమతి లేని ఆస్పత్రి సీజ్‌

ఏన్కూరు: ఏన్కూరులో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న గాయత్రీ అస్పత్రిని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రామారావు సోమవారం సీజ్‌చేశారు. వైద్యుడు నరేష్‌ అర్హతకు మించి చికిత్స చేస్తున్నట్లు గుర్తించడమే కాక ఆస్పత్రికి రిజిస్ట్రేషన్‌ లేదని కూడా ఆయన తెలిపారు. ఈమేరకు రికార్డులు స్వాధీనం చేసుకుని ఆస్పత్రిని సీజ్‌ చేసినట్లు డీఎంహెచ్‌ఓ రామారావు వెల్లడించారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ప్రదీప్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సంపత్‌, వైద్యాధికారి డాక్టర్‌ బి.రాములు పాల్గొన్నారు.

చెరుకు తోటలో

కొండచిలువ

నేలకొండపల్లి: చెరుకు నరుకుతున్న కూలీలకు కొండచిలువ కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. మండలంలోని మోటాపురానికి చెందిన రామూర్తి తోటలో చెరుకు నరికేందుకు సోమవారం ఉదయం ఏపీకి చెందిన కూలీలు వచ్చారు. వీరు పనిచేస్తుండగా 12అడుగులకు పైగా ఉన్న కొండ చిలువ కని పించడంతో పరుగులు తీశారు. ఆపై గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పలువురు చేరుకుని దాన్ని హతమార్చారు.

చెల్లని చెక్కు కేసులో

ఏడాది జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ మహిళకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడుకు చెందిన మంగిపుడి నాగమణి వద్ద అదే గ్రామానికి చెందిన బార్ల రత్నకుమారి 2020 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2021 సెప్టెంబర్‌లో చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగమణి తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం రత్నకుమారికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లంచాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

చోరీ కేసులో ఆరు నెలలు...

ఖమ్మం లీగల్‌: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా చాట్రాయి మండలం చిత్రపూర్‌ గ్రామానికి చెందిన త్రివేదుల సురేంద్రకు చోరి కేసులో ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. అలాగే, నిందితుడిపై ఉన్న మరో మూడు కేసుల్లో ఇంకో ఆరు నెలల జైలుశిక్ష విధించారు. ఖమ్మం అర్బన్‌ మండలం ధంసలాపురం కాలనీకి చెందిన వేరోజు వెంకటాచారి ఊరు వెళ్లగా జనవరి 11న చోరీ జరిగింది. ఆయన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఖమ్మం అర్బన్‌ పోలీసులు సురేంద్రను నిందితుడిగా గుర్తించి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఆయనపై నేరం రుజువు కావడంతో జైలుశిక్ష విధించారు. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీఓ జి.రాహుల్‌ వాదించగా కానిస్టేబుల్‌ అల్వాల మదార్‌ సహకరించారు.

ప్రైవేట్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

ఖమ్మంరూరల్‌: ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఖమ్మం ఖానాపురం పరిధిలోని బాలాజీనగర్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి పిల్లలమర్రి పాముల కేశవులు (63) మృతి చెందాడు. బాలాజీనగర్‌లో నివాసముంటున్న ఆయన ఏదులాపురం మున్సి పాలిటీ టీఎన్జీవోస్‌ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఉదయం కొత్త ఇంటి వద్దకు ద్విచక్రవాహనంపై వస్తుండగా వెనకాల నుంచి ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడి న కేశవులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయ న భార్య నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాయుడు తెలిపారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి..

ఖమ్మంరూరల్‌: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందగా, మండలంలోని కొండాపురం ప్రదాన రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కై కాలి గ్రామానికి చెందిన ధనంజయ్‌ నస్కార్‌(20) కొండాపురం వద్ద ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పని చేస్తూ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈనెల 19న రాత్రి ఇంటికి నుంచి వెళ్లిన నస్కార్‌ తిరిగి రాకపోవడంతో 21వ తేదీన రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంతలోనే కొండాపురం ప్రధాన రహదారి పక్కన పాడుబడిన ఇంట్లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. కాగా, ధనుంజయ్‌ని ఎవరైనా హత్య చేశారా, సాధారణ మరణమా అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. అనంతం అన్నం సేవా ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement