●ప్రజల ముందే ప్రమాణం చేస్తాం..
తల్లాడ: తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ప్రజల ముందే ప్రమాణ స్వీకారం చేస్తామని పట్టుబట్టారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా సోమవారం ర్యాలీ నిర్వహించగా, మధ్యాహ్నం ఒంటి గంటకు సర్పంచ్ పెరికె నాగేశ్వర్‌రావు, వార్డు సభ్యులు గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చా రు. పంచాయతీ హాల్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పా ట్లు చేయగా, గ్రామపంచాయతీ ముందు స్టేజీపై ప్రజల ముందే ప్రమాణ స్వీకారం చేస్తామని పాలకవర్గం పట్టుబట్టింది. ఈఓ కృష్ణారావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లోపలే చేయిస్తామని చెప్పినా ససే మిరా అనడంతో ఎంపీడీఓ, డీఎల్‌పీఓకు ఫోన్‌చేసి విషయాన్ని చెప్పారు. దీంతో ఆఫీస్‌లో ఫొటోలు తీసి బయట ప్రమాణం చేయించాలని సూచించడంతో కార్యక్రమం కొనసాగించారు.


