రేపు జాబ్ మేళా
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేలా ఈనెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. భారత్ హ్యుండాయ్ కంపెనీలో సేల్స్ కన్సల్టెంట్, సర్వీస్ అడ్వైజర్, అకౌంట్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్, సీఆర్‌ఈ, టీం లీడర్, మేనేజర్ తదితర పోస్టులకు అర్హులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని వెల్లడించారు. డిగ్రీ విద్యార్హత కలిగిన నిరుద్యోగులు ఈనెల 24వ తేదీన ఖమ్మం టీటీడీసీ భవన్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని, వివరాలకు 70369 02902 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
పదోన్నతులతో
పెరగనున్న బాధ్యతలు
ఖమ్మంక్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ అన్నారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టే బుళ్లుగా పనిచేస్తున్న పది మందికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి లభించింది. ఈమేరకు డి.వెంకటసుబ్బారావు, అప్పారావు, పాపారావు, వెంకటసుబ్బారావు, వెంకన్న, అంజం రాజు, వెంకటేశ్వరరావు, హనీఫ్, రామానుజాచారి, వెంకటేశ్వర్లు సీపీని సోమవారం కలవగా అభినందించారు. కాగా, వీరిలో ఖమ్మం జిల్లాకు ఒకరిని, మహబూబాబాద్ జిల్లాకు ఇద్దరిని, భద్రాద్రి జిల్లాకు ఏడుగురిని కేటాయించారు.
రామిరెడ్డికి
ఏఐసీసీ కార్యదర్శి నివాళి
కూసుమంచి: మండలంలోని పాలేరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు యడవెల్లి రాంరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా సోమవారం రాత్రి ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ విశ్వనాధన్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. పాలేరులోని ఆయన ఇంటికి వచ్చిన ఆయన రాంరెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు.రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయకులు ఎండీ.హఫీజుద్దీన్, బజ్జూరి వెంకట్‌రెడ్డి, బెల్లంకొండ శరత్, నాగిరెడ్డి రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులకు
అందని నాణ్యమైన విద్య
ఖమ్మం సహకారనగర్: కేంద్రప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో సామాన్యులకు విద్య అందకపోగా, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య కూడా సాధ్యం కావడం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగానికి ఏటా బడ్జెట్ తగ్గించడమే కాక ప్రాథమిక విద్యారంగానికి నిధులు కేటాయించకుండానే కొత్త పేర్లతో పాఠశాలలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనంతరం వై.అశోక్ కుమార్, ఎం.సోమయ్య, కె.రవిచంద్ర, ఏ.రామారావు, వి.మనోహర్‌రాజు మాట్లాడగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్.రమేష్, అధ్యక్షులుగా టి.వెంగళరావు, ప్రధా న కార్యదర్శిగా రాజు, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఏ రామారావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా ఎం.రవీందర్, జి.రమేష్, పి. నాగేశ్వరరావు, కృష్ణయ్య, నాగమణి, ఎస్.పూర్ణచంద్రరావు, పి.వీరభద్రం, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణారావు, కార్యదర్శులుగా వెంకటేష్, జి.మస్తాన్, ఐ.రామకృష్ణ, లక్ష్మీనా రాయణ, కె.రామ్మోహన్‌రావు, అజీజ్ టి. నారాయణను ఎన్నుకున్నట్లు తెలిపారు.
రేపు జాబ్ మేళా
రేపు జాబ్ మేళా


