వాతావరణ ం
గరిష్టం / కనిష్టం
310 / 130
న్యూస్‌రీల్
ఎన్నికల జరిగే మండలాల్లో జీపీలు, వార్డులు, అధికారుల వివరాలు
168 సర్పంచ్, 1,372 వార్డు స్థానాలకు ఎన్నికలు
318 సమస్యాత్మక కేంద్రాల్లో
వెబ్‌కాస్టింగ్
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి
బయలుదేరిన ఉద్యోగులు
మూడో విడత ఎన్నికలు జరిగే జీపీలు, వార్డులు, ఓటర్ల వివరాలు (ఏకగ్రీవాలు మినహా)
జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రత కాస్త పెరిగే అవకాశముంది. రాత్రి మాత్రం చలిగాలుల తీవ్రత ఉంటుంది.
కేన్సర్ బాధితులకు ఊరట
‘ఆరోగ్య మహిళ’ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తూ, జిల్లా ఆస్పత్రిలో కీమోథెరపీ
చేస్తుండడంతో దూరాభారం తప్పుతోంది.
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కారేపల్లిలో పోలింగ్ సామగ్రి తీసుకునేందుకు వచ్చిన ఉద్యోగులు (ఇన్ సెట్) బ్యాలెట్ బాక్స్, సామగ్రితో కేంద్రానికి వెళ్తున్న ఉద్యోగులు
బరిలో 3,854మంది
మూడో విడతలో 191 గ్రామపంచాయతీలు, 1,742 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు సర్పంచ్ స్థానాలకు 1,025, వార్డులకు 4,085 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆపై 21 గ్రామపంచాయతీల వార్డులతోపాటు సర్పంచ్ స్థానాలు, ఒక సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా.. ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక్కడ ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. మొత్తంగా 22 పంచాయతీలు పోగా 168 జీపీల్లో బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, 9 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోగా, 361 ఏకగ్రీవమయ్యాయి. ఇవి మినహా 1,372 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. సర్పంచ్ స్థానాలకు 485 మంది, వార్డులకు 3,369 మంది బరిలో ఉన్నారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం
జిల్లాలో ఏడు మండలాల్లోని గ్రామపంచాయతీల్లో పోలింగ్‌కు యంత్రాంగం సిద్ధమైంది. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లుచేయడమే కాక మైక్రో అబ్జర్వర్లను కేటాయించారు. 1,564 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను 1,742 బృందాలు పర్యవేక్షిస్తాయి. కేంద్రాల్లో 2,091మంది పీఓలు, 2,493మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు.
సామగ్రి పంపిణీ
తుది విడత ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగులకు మండల స్థాయి కేంద్రాల్లో మంగళవారం సామగ్రి పంపిణీ చేశారు. బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలను, ఇతర సామగ్రితో ఉద్యోగులు వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కారేపల్లి జూనియర్ కాలేజీలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి పరిశీలించగా, సత్తుపల్లిలో డిప్యూటీ సీఈఓ నాగపద్మజ పరిశీలించారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. పోలింగ్ ముగియగానే లెక్కింపు కేంద్రంలో ఓట్ల సంఖ్య ఆధారంగా టేబుళ్లు ఏర్పాటుచేస్తారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లెక్కించాక, వార్డు సభ్యుల ఓట్లు, చివరగా సర్పంచ్ ఓట్ల లెక్కింపు చేపడుతారు.
కట్టుదిట్టంగా భద్రత
ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 318 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ఆయా కేంద్రాల్లో 23 మంది మైక్రో అబ్జర్వర్లతో పాటు ఎనిమిది మంది ఏసీపీలు, 20మంది సీఐలు, 87 మంది ఎస్సైలు, 1,700 మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు విధులకు కేటాయించారు.
ఫైనల్ ఫైట్.. నేడే !
ఏడు మండలాల్లోని
జీపీల్లో పోలింగ్
గ్రామపంచాయతీ ఎన్నికలు తుదిదశకు చేరాయి. చివరి విడతగా బుధవారం ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మంగళవారం పోలింగ్ సామగ్రిని తీసుకున్న ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతూ ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది.
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం
మండలం జీపీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులతో కలిపి
మొత్తం
ఏన్కూరు 17 123 9,008 9,746 18,754
కల్లూరు 21 160 16,045 16,774 32,819
పెనుబల్లి 30 247 19,704 20,819 40,523
సత్తుపల్లి 18 168 15,644 16,832 32,478
సింగరేణి 35 255 20,429 21,365 41,796
తల్లాడ 24 205 20,655 21,728 42,385
వేంసూరు 23 214 17,415 18,116 35,531
మొత్తం 168 1,372 1,18,900 1,25,380 2,44,286
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం
వాతావరణ ం


