పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కారేపల్లి: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. ఉద్యోగులు పూర్తిస్థాయిలో నిబంధనలు పాటిస్తే ఏ ఇబ్బంది ఎదురుకాదని చెప్పారు. ఉదయం 7గంటలకు పోలింగ్ మొదలుపెట్టి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని సూచించారు. కేంద్రాల వద్ద ఓటర్లకు తాగునీరు, టెంట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి కూడా పరిశీలించగా, మండల ప్రత్యేకాధికారి చందన్‌కుమార్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో పరిశీలన
కారేపల్లి: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యాన సింగరేణి మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు కమిషనర్ మంగళవారం పరిశీలించారు. కారేపల్లి పోలింగ్ కేంద్రంలో బందోబస్తుపై ఆరా తీసిన ఎలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓటర్లు కూడా సమన్వయం పాటించాలని సూచించారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం


