జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని వకుళామాత స్టేడియంలో సోమవారం తొలిసారి శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం నిర్వహించారు. ఆ తర్వాత చామంతి తదితర పూలతో స్వామి, అమ్మవార్లకు పుష్పయాగం చేశారు. అలాగే, వేంకటేశ్వరస్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, స్టేడియం నిర్మాణ దాత తుళ్లూరు కోటేశ్వరరావు– నిర్మల దంపతులు, అర్చకులు రాజీవ్‌శర్మ, మార్తి వెంకటరమణ, కాసులనాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు డిప్యూటీ సీఎం పర్యటన
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం మధిరలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 క్యాంపు కార్యాలయాన్ని రానున్న అధికారులతో సమావేశమవుతారు. ఆతర్వాత నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లతో మాట్లాడి అభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు.
త్వరలోనే అందుబాటులోకి వంద పడకల ఆస్పత్రి
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలో రూ.35 కోట్లతో నిర్మించిన వంద పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ తెలిపారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిని సోమవారం తనిఖీ చేసిన ఆయన ల్యాబ్, పేషెంట్ వార్డులు, డయాలసిస్, సిమాంక్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సూపరిండెంటెంట్ కె.వెంకటేశ్వర్లు, ఉద్యోగులతో సమావేశమైన ఆయన సాధారణ కాన్పులు పెంచడంతో పాటు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. డాక్టర్ సురేష్‌నారాయణ్, ఉద్యోగులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన
ఖమ్మంవ్యవసాయం: పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణపై అందరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా అటవీ అధికారి(డీఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ సూచించారు. రాష్ట్ర చిహ్నాలు, ముఖ్యమైన వణ్య ప్రాణులు, ప్రకృతి సంరక్షణను వివరిస్తూ రూపొందించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచడం, ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించడమే లక్ష్యంగా పోస్టర్ల ద్వారా ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ మంజుల, గ్రీన్ వారియర్ జేవీఎస్.చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం
జమలాపురంలో శ్రీవేంకటేశ్వర వ్రతకల్ప ఉత్సవం


