పాఠశాలల రేటింగ్‌పై రాష్ట్ర బృందం పరిశీలన
ఖమ్మం సహకారనగర్: ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ పథకం కింద జిల్లా స్థాయిలో ఎంపికైన ఎనిమిది పాఠశాలలను రాష్ట్రస్థాయి బృందం సోమవారం పరిశీలించింది. సత్తుపల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని ఆయా పాఠశాలలను పరిశీలించాక రాష్ట్ర పరిశీలకుడు సైదులు మాట్లాడారు. ఎకో క్లబ్ కార్యక్రమాల నిర్వహణ, పచ్చదనం – పరిశుభ్రత, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, విద్యార్థుల్లో పరిసరాలపై అవగాహన తదితర అంశాలను పరిశీలించి రేటింగ్ ఇస్తామని తెలిపారు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే అత్యధిక రేటింగ్ పొందిన పాఠశాలలు రాష్ట్ర, జాతీయ స్ధాయిలో అవార్డుకు ఎంపికవుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యుడు స్వరూప్‌కూమార్, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


