●నాడు భర్త... నేడు భార్య
నేలకొండపల్లి/తిరుమలాయపాలెం: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలిచారు. ఇదే పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త మన్నె నగేష్ 2013లో టీడీపీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు రాజశ్రీ కాంగ్రెస్ నుంచి గెలుపొందడం విశేషం. అలాగే, తిరుమలాయపాలెం మండలం గోల్‌తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌లుగా భార్యాభర్తలకు అవకాశం దక్కింది. బానోతు అనిల్‌కుమార్ వైఎస్సార్ సీపీ బలపరచగా 2013 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో అనిల్ భార్య బానోతు సుజాత 282 మెజార్టీతో విజయం సాధించింది.
●నాడు భర్త... నేడు భార్య
●నాడు భర్త... నేడు భార్య
●నాడు భర్త... నేడు భార్య


