మలివిడతకు రెడీ
న్యూస్‌రీల్
రెడ్‌నోటీసులు...
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా బకాయిదారులకు రెడ్‌నోటీసులు జారీ చేస్తున్నారు.
జిల్లాలో రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. కామేపల్లి, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో ఏకగ్రీవాలు పోగా మిగతా సర్పంచ్ స్థానాలు, వార్డుల్లో పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాక, ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్‌ల ఎన్నిక ఉంటుంది. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
ఆదివారం శ్రీ 14 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బ్యాలెట్ పేపర్లు సరి చూసుకుంటున్న సిబ్బంది
160 జీపీలు..
1,379 వార్డుల్లో పోలింగ్
రెండో విడతగా 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డుల్లో ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతనెల 30 నుంచి ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సర్పంచ్ స్థానాలకు 1,055, వార్డులకు 4,160 నామినేషన్లు దాఖలు కాగా 19 గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లతోపాటు వార్డుస్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. అలాగే, నాలుగు జీపీల్లో సర్పంచ్ స్థానాలే ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 23 స్థానాలు పోగా 160 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక ఏకగ్రీవమైన 306 వార్డులు, నామినేషన్లు దాఖలు కాని ఒక వార్డు మినహా 1,379 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్ స్థానాలకు 451 మంది, వార్డులకు 3,352 మంది పోటీ పడుతున్నారు. మొత్తం 1,526 కేంద్రాలకు గాను 304 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనుండగా, ఓటర్లకు సౌకర్యాలు కల్పించారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వై లెన్స్ సహా 1,526 బృందాలు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తాయి.
ఉద్యోగులకు
సామగ్రి పంపిణీ
మండల స్థాయిలో 20కేంద్రాల ద్వారా సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని శనివారం అందజేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెళ్లిరావడానికి బస్సులు కేటాయించారు. కూసుమంచి, కామేపల్లిల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ముదిగొండ, నేలకొండపల్లిల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ పరిశీలించారు. ఖమ్మంరూరల్ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పరిశీలించి ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.
పోలింగ్.. ఆ వెంటనే కౌంటింగ్
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటుచేయడంతో పాటు సీసీ టీవీలు బిగించారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చి, రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ ఫలితాలను ప్రకటిస్తారు.
భారీ భద్రత
పోలింగ్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు కూడా చేరుకున్నాయి. భద్రతను అడిషనల్ డీసీపీలు పర్యవేక్షిస్తూ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, రూట్‌మొబైల్ పార్టీలు, ఐదు ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 15 ఎస్‌ఎఫ్‌టీ బృందాల ద్వారా నిఘా వేయనున్నారు. మొత్తంగా 304 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాటు చేశారు. అలాగే, 77 పోలింగ్ కేంద్రాల్లో నామినేషన్ల దాఖలు నుంచే నిఘా పెంచారు.
మలివిడతకు రెడీ
మలివిడతకు రెడీ
మలివిడతకు రెడీ
మలివిడతకు రెడీ


