తొలివిడత.. బరి ఖరారు | - | Sakshi
Sakshi News home page

తొలివిడత.. బరి ఖరారు

Dec 5 2025 6:09 AM | Updated on Dec 5 2025 6:09 AM

తొలివిడత.. బరి ఖరారు

తొలివిడత.. బరి ఖరారు

మండలాల వారీగా అభ్యర్థులు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. మొదటి దశగా జిల్లాలోని కొణిజర్ల, రఘునాథపాలెం, వైరా, బోనకల్‌, చింతకాని, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 192 గ్రామపంచాయతీలకు గాను 1,740 వార్డులు ఉన్నాయి. ఈ స్థానాలకు పలువురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారంతో ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో సర్పంచ్‌, వార్డుసభ్యుల స్థానాల్లో బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 192 సర్పంచ్‌ స్థానాలకు 20 ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగే 172 స్థానాల్లో 476మంది అభ్యర్థులు పోటీకి మిగిలారు. ఇక 1,740వార్డులకు గాను రెండు స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగతా వాటిలో 323 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఎన్నికలు జరిగే 1,415 స్థానాల నుంచి ఉపసంహరణ అనంతరం 3,275మంది బరిలో నిలిచారు.

మండలం జీపీలు / వార్డుస్థానాలు సర్పంచ్‌ వార్డు

అభ్యర్థులు అభ్యర్థులు

కొణిజర్ల 27 / 254 73 524

రఘునాథపాలెం 37 / 308 106 589

వైరా 22 / 200 99 348

బోనకల్‌ 22 / 210 83 414

చింతకాని 26 / 248 120 466

మధిర 27 / 236 118 468

ఎర్రుపాలెం 31 / 284 116 466

మొత్తం 192 / 1,740 476 3,275

సర్పంచ్‌, వార్డు స్థానాలకు పోటీలో

37,51 మంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement