ఘర్షణలకు తావు ఇవ్వొద్దు
ఖమ్మంక్రైం: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా సాఫీగా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని పోలీసు కమిషనర్ సూచించారు. జిల్లాలోని పోలీస్‌స్టేషన్ల అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఘర్షణలు తలెత్తకుండా, ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా విధులు నిర్వర్తిస్తూనే ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అంతేకాక గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను బైండోవర్ చేయాలని, బెల్ట్‌షాపులను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని తెలిపారు. ఇదేసమయాన సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ సూచించారు. అడిషనల్ డీసీపీ ప్రసాద్‌రావు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మహేష్, సీఐ రాజిరెడ్డి పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీ సునీల్‌దత్
ఘర్షణలకు తావు ఇవ్వొద్దు


