అంతా ఏకతాటిపై!
అమాత్యుల గ్రామాల్లో ఏకగ్రీవాలు
● డిప్యూటీ సీఎం భట్టి స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో ఖరారు ● మంత్రులు పొంగులేటి, తుమ్మల గ్రామాల్లోనూ అదేబాట
●డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ మద్దతుదారుడు అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో ఏడుగురు నామినేషన్లు వేసినా చివరి రోజునాటికి ఆరుగురు ఉపసంహరించుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లుతో పాటు ఎనిమిది వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.
●కల్లూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీని ఏకగ్రీవం చేసేలా చర్చలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్వగ్రామమైన నారాయణపురంలో 1,385 మంది ఓటర్లు, పది వార్డులు ఉన్నాయి. మూడో విడతలో ఇక్కడ ఎన్నిక జరగనుండగా శుక్రవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశముంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయిన ఈ స్థానంలో మొదటి రెండు రోజులు ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. ఏకగ్రీవం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నండడంతో ఎవరూ నామినేషన్ వేయలేదని తెలిసింది. ఏకగ్రీవంపై నిర్ణయం జరిగాక చివరి రోజు సర్పంచ్, వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు చేసేలా చర్చిస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా ఈ పంచాయతీ ఏకగ్రీవం అయింది. అప్పుడు రెండున్నర ఏళ్లు ఒక పాలకవర్గం, మరో రెండున్నర ఏళ్లు ఇంకో పాలకవర్గం పాలన సాగించింది.
అంతా ఏకతాటిపై!
అంతా ఏకతాటిపై!


