మత్యకారుల అభివృద్ధికి చర్యలు
నేలకొండపల్లి : జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి జి.శివప్రసాద్ తెలిపారు. మండలంలోని చెరువుమాధారం చెరువులో శుక్రవారం చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 882 చెరువుల్లో 3.48 కోట్ల చేప పిల్లలు పోసేలా కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఇప్పటి వరకు 202 చెరువుల్లో 65 లక్షల చేపపిల్లలు వదిలామని, కట్ల, రవ్వు, మరిగాల వంటి రకాల పిల్లలు సరఫరా చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది కోటేశ్వరరావు, భానుప్రసాద్, చెరువుమాధారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు ఎండీ ఖాసీం, ఉపాధ్యక్షుడు ధీరావత్ రాధాకృష్ణమూర్తి, డైరెక్టర్లు బలరాం, శేషయ్య, మస్తాన్, రోశయ్య, వి.శ్రీను పాల్గొన్నారు.


