జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ
ఖమ్మం సహకారనగర్: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యాన గత నెల 31న నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహించిన జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ఖమ్మం ఏఎస్‌ఆర్ శాంతినగర్ కాలేజీ విద్యార్థిని సత్తా చాటింది. కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న దేవిశ్రీ ప్రసన్న 85శాతం మార్కులతో అగ్రస్థానాన నిలిచింది. ఈమేరకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రూ.లక్ష నగదు బహుమతి గెలుచుకుంది. ఈ సందర్భంగా దేవీశ్రీతో పాటు ఆమె తల్లిని గురువారం కళాశాలలో డీఐఈఓ రవిబాబు, ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్ బాధ్యులు బాబు బయ్యన్న సన్మానించారు. ప్రిన్సిపాల్ గోవిందరావు, కోచ్ నరసింహస్వామి, అధ్యాపకులు నరేష్‌కుమార్, భరత్‌కుమార్, లింగానాయక్ పాల్గొన్నారు.


