జిల్లా రవాణాశాఖాధికారిగా జగదీష్
ఖమ్మం క్రైం: ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లా రవాణా శాఖకు పూర్తిస్థాయి అధికారిని నియమించింది. ఇటీవల వెల్లడైన గ్రూప్–1 ఫలితాల్లో ఆర్‌టీఓలుగా ఎంపికై న పలువురికి శిక్షణ అనంతరం పోస్టింగ్ కేటాయించారు. వీరిలో హనుమకొండకు చెందిన ధర్మపురి జగదీష్‌ను జిల్లా రవాణా శాఖాధికారిగా నియమించారు. ఏడాది క్రితం ఆఫ్రిన్ డీటీఓగా నియమితులైనా కొన్నాళ్లకు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అప్పటి నుంచి ఎంవీఐ వెంకటరమణ ఇన్‌చార్జ్ డీటీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం డీటీఓగా నియమితులైన జగదీశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.


