అందుబాటులో విద్యుత్ ఎమర్జెన్సీ బృందం
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇక నుంచి విద్యుత్ ఎమర్జెన్సీ బృందం అందుబాటులో ఉంటుందని ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. వరంగల్ క్రాస్ రోడ్డులో బుధవారం ఆయన ఈఆర్‌టీ(ఎమర్జెన్సీ రిస్టోరేషన్ టీం) వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం కార్పొరేషన్లు, పట్టణాల్లోనే ఉన్న ఈ వాహనాలను మున్సిపాలిటీల్లో సైతం ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఈ వాహనంలో శిక్షణ పొందిన సిబ్బందితో పాటు మరమ్మతులకు అవసరమైన పరికరాలు ఉంటాయని చెప్పారు. విపత్తుల సమయాన విద్యుత్ స్తంభాలు నేలకూలడం, వైర్లు తెగిపడడం, చెట్లు కూలి సరఫరాకు అంతరాయం ఏర్పడితే సిబ్బంది తక్షణమే చేరుకుని పునరుద్ధరిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఈలు నాగేశ్వరరావు, జె.భద్ర, ఏఈలు ప్రభాకర్‌రావు, రామకృష్ణ, లైన్‌మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.


