
అక్రమ కేసులు పెడితే సహించం..
సత్తుపల్లి/ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ కార్యకర్తల జోలికి వచ్చినా, అక్రమ కేసులు బనాయించినా సహించేది లేదని మాజీ ఎంపీ సీతారాం నాయక్ హెచ్చరించారు. ఇటీవల సత్తుపల్లిలో తమ కార్యక్రమాలపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా జరిగిన ఘర్షణపై బీజేపీ ఆధ్వర్యాన నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటుచేయగా, బీజేపీ ఓబీసీ, ఎస్సీ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు గంగామల్ల ఆనందగౌడ్, అత్తునూరి క్రాంతికిరణ్‌తో కలిసి సీతారాంనాయక్ బుధవారం సత్తుపల్లి పర్యటించారు. అనంతరం సత్తుపల్లి, ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పోలీసులు బీజేపీ నాయకులపైనే అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు, గిరిజన నాయకుడు బానోతు విజయ్‌పై దాడి పోలీసులకు కనబడలేదా అని ప్రశ్నించారు. బీసీలపై ఎస్సీలతో కేసు పెట్టించడంపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కాగా, రాహుల్ గాంధీ చెప్పినట్లు బీసీలకు జనాభా దామాషా ప్రకారం పదవులు ఇవ్వాలంటే మంత్రివర్గంలోని ఓసీలను తొలగించి బీసీ నియమించాలని సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ తీరుతో బీసీలకు రిజర్వేషన్లు రావని తెలిపారు. బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఈ.వీ.రమేష్, నాయుడు రాఘవరావు, సాలి శివ, సురేందర్‌రెడ్డి, రహ్మతుల్లా, బాలకృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, గెంటెల విద్యాసాగర్, రామలింగేశ్వరరావు, నున్నా రవి, నాయుడు రాఘవరావు, గుతా్‌త్ వెంకటేశ్వర్లు, రవిరాథోడ్, వీరవెల్లి రాజేష్‌గుప్తా, ఎన్.బెనర్జీ, మందడపు సుబ్బారావు, జ్వాల నరసింహారావు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ
సీతారాంనాయక్