
పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
కారేపల్లి/ఖమ్మం వ్యవసాయం/తల్లాడ: కారేపల్లిలోని శ్రీలక్ష్మీప్రియ కోటెక్స్ జిన్నింగ్ మిల్లులో ఇల్లెందు మార్కెట్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు మాలోతు రాందాస్‌నాయక్, కోరం కనకయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తోందని తెలిపారు. ఈమేరకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇల్లెందు మార్కెట్ చైర్మన్, కార్యదర్శులు బి.రాంబాబు, నరేష్, వైరా ఏడీఏ కరుణశ్రీ, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, ధరావత్ భద్రునాయక్, షేరు, యాకూబ్ అలీ, సఫావట్ నాగులు, అడప పుల్లారావు పాల్గొన్నారు. అలాగే, తల్లాడలోని స్టేపు ల్ రిచ్ జిన్నింగ్ మిల్లు, ఖమ్మం మార్కెట్ పరిధి గుర్రాలపాడులోని జీఆర్‌ఆర్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను మార్కెటింగ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ లక్ష్మీభాయి ప్రారంభించారు. పత్తిలో 8 నుంచి 12శాతం మేర తేమ ఉండేలా తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందని ఆమె తెలిపారు. వరంగల్ రీజినల్ జేడీ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీమ్, మార్కెట్ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు యరగర్ల హన్మంతరావు, తల్లాడ రమేష్, బోళ్ల రంగారావు, కాపా సుధాకర్, మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్, సీసీఐ సీపీఓ పవన్‌కల్యాణ్, ఏఓలు ఎండీ.తాజుద్దీన్, వెంకటేశ్వర్లు, నాయకులు మట్టా దయానంద్, నారాయణవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.