రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం

Oct 23 2025 6:21 AM | Updated on Oct 23 2025 6:21 AM

రూ.లక్ష విలువైన  గంజాయి స్వాధీనం

రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనం

ఖమ్మంరూరల్‌: మండలంలోని కస్నాతండా వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.లక్ష విలువైన గంజా యిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నా రు. సీఐ ముష్కరాజు తెలిపిన వివరాలు.. ఖమ్మం రూరల్‌ మండలం కస్నాతండాకు చెందిన వాంకుడోత్‌ వినోద్‌, రంగారెడ్డి జిల్లా కొత్తపేటకు చెందిన వస్కుల రాజు, హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన గొడ్డెమల్ల సాయిరామ్‌, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెంకు చెందిన భూక్యా రోహిత్‌ ఖమ్మం – మహబూబాబాద్‌ హైవే పక్కన కస్నాతండా సమీపాన మద్యం తాగుతున్నారు. పెట్రోలింగ్‌లో భాగంగా పోలీసులు అటువైపు వెళ్లగా రోహిత్‌ పారిపోయాడు. మిగిలిన ముగ్గురిని తనిఖీ చేయగా రూ.లక్షల విలువైన రెండు కేజీల గంజాయి లభించగా, ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి హైదరాబాద్‌లో అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజు తెలిపారు.

లీజ్‌కు ఇచ్చిన కారు తాకట్టు

చింతకాని: దళితబంధు లబ్ధిదారుడు తన కారును లీ జ్‌కు ఇస్తే ఎదుటి వ్యక్తి తాకట్టు పెట్టడంతో కేసు నమోదైంది. చింతకాని మండలం తిరుమలాపురానికి చెంది న చాపలమడుగువీరబాబుకు దళితబంధు కింద కారు వచ్చింది. ఈ కారును లచ్చగూడెం వాసి తాటికొండ డిసిల్వాకు లీజ్‌కు ఇచ్చాడు. ఆయన ఖమ్మంలో వ్యక్తి వద్ద తాకట్టుపెట్టి రూ.లక్షన్నర తీసుకోగా, అదేకారును ఏపీలోని నూజివీడు వాసికి తాకట్టు పెట్టాడు. ఈ విష యం తెలిసి వీరబాబు వెళ్లి అడగగా రూ.లక్షన్నర ఇస్తే కారు ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వీరబాబు చేసిన ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్‌ తెలిపారు.

చెల్లని చెక్కు కేసులో

ఏడాది జైలుశిక్ష

ఖమ్మం లీగల్‌: ఓ మహిళ తీసుకున్న అప్పు చెల్లించేందుకు జారీచేసిన చెక్కు చెల్లకపోవడంతో ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు జడ్జి ఏపూరి బిందుప్రియ బుధవారం తీర్పు చెప్పారు. ఖమ్మం సంభానీనగర్‌కు చెందిన మేకల రాంబాబు వద్ద మామిడిపద్మ 2020నవంబర్‌లో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2023 జూన్‌లో చెక్కు ఇచ్చి నామె ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో రాంబాబు తన న్యాయవాది ద్వారా లీగల్‌ నోటీస్‌ జారీ చేసి కోర్టులో ప్రైవేట్‌ కేసుదాఖలు చేశాడు. విచారణ అనంతరం పద్మకు ఏడాది జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లించాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement