పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

Oct 16 2025 5:59 AM | Updated on Oct 16 2025 5:59 AM

పుణ్య

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

ఖమ్మంమయూరిసెంటర్‌: కార్తీక మాసంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ ఏ.సరిరామ్‌ తెలి పారు. ఖమ్మంలో బుధవారం ఆయన డిపో మేనేజర్లు, సూపర్‌వైజర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి అన్నవరం, పంచారామాలకు సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు నడపాలని నిర్ణయించినట్లు తెలి పారు. కార్తీకమాసంలో ప్రతీ ఆదివారం రాత్రి 8 గంటలకు అన్ని బస్టాండ్ల నుండి బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం యాత్రల వివరాలతో కూడిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం మల్లయ్య, పీఓ సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ

ఖమ్మం స్పోర్ట్స్‌: బాలికల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వనున్నట్లు డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని 25 పాఠశాలల్లో మూడు నెలల పాటు శిక్షణ ఉంటుందని, వారానికి ఆరు సెషన్లు మించకుండా 24తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. కాగా, కరాటే శిక్షణకు మహిళలకు ప్రాధ్యానత ఇస్తామని, ఎక్కడైనా అందుబాటులో లేకపోతే పురుషులకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వనుండగా, బ్లాక్‌ బెల్ట్‌ ఉన్న వారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 2గంటల్లోగా సర్దార్‌ పటేల్‌ స్టేడియంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్‌ఓ సూచించారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌

ఇళ్ల కేటాయింపు

ఖమ్మం సహకారనగర్‌: పెనుబల్లి మండలం ఏరుగట్లలో నిర్మాణం పూర్తయిన –40 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో లబ్ధిదారుల సమక్షాన ఇళ్లు కేటాయించామని జిల్లా రెవెన్యూ అధికారి ఏ.పద్మశ్రీ తెలిపారు. గతంలోనే లబ్ధిదారులను ఎంపిక చేయగా, ర్యాండమైజేషన్‌ ద్వారా ఇళ్ల కేటాయింపు చేపట్టామని చెప్పారు. ఈకార్యక్రమంలో ఈడీఎం దుర్గాప్రసాద్‌, ఉద్యోగులు రాజశేఖర్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

పోలీసు శాఖ ఆధ్వర్యాన ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు

ఖమ్మంక్రైం: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం(ఫ్లాగ్‌ డే)ను పురస్కరించుకుని రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. పోలీసుల త్యాగాలు, విధుల్లో వారి ప్రతిభను చాటేలా తీసిన మూడు ఫొటోలు, మూడు నిమిషాల లోపు నిడివితో రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌ పెన్‌డ్రైవ్‌లను తమ కార్యాలయంలో ఈనెల 22వ తేదీలోగా అందజేయాలని సూచించారు. గత ఏడాది అక్టోబర్‌ నుండి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు తీసిన ఫొటోలు, షార్ట్‌ ఫిల్మ్‌లనే సమర్పించాలని తెలిపారు. వివరాల కోసం 87126 59256 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నేత్రపర్వంగా

రామయ్య నిత్యకల్యాణం

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

పుణ్యక్షేత్రాలకు  ఆర్టీసీ బస్సులు
1
1/1

పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement