
ఈ మూడు రోజులే కీలకం
సిండికేట్ అవుతున్న
వ్యాపారులు
● 116 వైన్స్‌కు ఇప్పటివరకు 492 దరఖాస్తులే.. ● 18వ తేదీతో ముగియనున్న గడువు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 116 వైన్స్ కేటాయింపునకు టెండర్లు ఆహ్వానించగా ఇప్పటివరకై తే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గత నెల 26వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 18వ తేదీ శనివారంతో గడువు ముగియనుంది. దీంతోచివరి మూడు రోజుల్లో అత్యధిక దరఖాస్తులు రాబట్టుకునేలా ఎకై ్సజ్ శాఖ అధికారులు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
గత పాలసీలో గరిష్టం
జిల్లాలో గత ఎకై ్సజ్ పాలసీలో వైన్స్‌కు అందిన దరఖాస్తుల ద్వారా రూ.144 కోట్లకు పైగా ఆదాయం నమోదైంది. అప్పట్లో దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉండగా ఈసారి రూ.3లక్షలకు పెంచారు. దీంతో ఈసారి కూడా గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు.. అదే స్థాయిలో ఆదాయం వస్తుందని అధికారులు భావించారు. కానీ బుధవారం నాటికి జిల్లావ్యాప్తంగా వైన్స్‌కు కేవలం 492 దరఖాస్తులు రావడం గమనార్హం. గడువు సమీపిస్తున్నా దరఖాస్తులు ఆశాజనకంగా లేకపోవడం.. మద్యం వ్యాపారంలో ఉన్న వారితో భేటీలు నిర్వహించి అవగాహన కల్పించినా ఫలితం లేకపోవడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
పదుల సంఖ్యలోనే...
జిల్లాలో ఖమ్మం ఎకై ్సజ్ స్టేషన్–1, 2, నేలకొండపల్లి, మధిర, వైరా, సత్తుపల్లి సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ఎకై ్సజ్ స్టేషన్–1 పరిధిలోని వైన్స్‌కు దరఖాస్తులు అధికంగా వచ్చాయి. కొన్ని స్టేషన్ల పరిధిలో పదుల సంఖ్య కూడా దాటలేదు. అయితే గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చివరి రెండు రోజులైన శుక్ర, శనివారాల్లో దరఖాస్తుదారులు పోటెత్తే అవకాశముంటుందని భావిస్తున్నారు. ఒకవేళ దరఖాస్తులు తగ్గినా ఫీజు రూ.3లక్షలుగా ఉన్నందున గతంలో మాదిరే ఆదాయం వస్తుందని ఆశిస్తున్నారు.
దరఖాస్తు ధర గత పాలసీలో రూ.2లక్షలు ఉంటే ఈసారి రూ.3లక్షలకు పెంచడంతో వ్యాపారుపై ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష అదనపు భారం పడుతోంది. దీంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తమ ప్రాంతాల పరిధిలో బాగా అమ్మకాలు ఉండే షాపులను ఎంచుకుని కలిసొచ్చే వారి పేర్లతో టెండర్లు వేయటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత పాలసీలో అధికంగా టెండర్లు వేసిన ఆంధ్రా వ్యాపారులు సైతం ఈసారి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. జిల్లా వ్యాపారులతో పాటు ఏపీ వ్యాపారులతోనూ సమావేశమైన ఎకై ్సజ్ అధికారులు అవగాహన కల్పించగా వారు ముందు కొచ్చినట్లు సమాచారం. అంతేకాక పలువురు రాజకీయ ప్రముఖులు సైతం బినామీల పేర్లతో టెండర్లు వేయాలనే భావనతో ఉన్నారని... వరంగల్, నల్లగొండ వ్యాపారులు సైతం ఖమ్మం జిల్లా వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.