
శరవేగంగా
జిల్లాకు 16,678 ఇళ్ల మంజూరు
వివిధ దశల్లో నిర్మాణాలు
నిరంతరం పరిశీలన
త్వరగా పూర్తిచేసుకునేలా అవగాహన
కట్టుదిట్టంగా..
ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలో..
పేదలకు అనువుగా, సౌకర్యవంతంగా ఇళ్లు ఉండేలా డిజైన్ రూపొందించిన ప్రభుత్వం మండల కేంద్రాల్లో నమూనా గృహాలను కూడా నిర్మించింది. ఇల్లు మంజూరైన అనంతరం లబ్ధిదారుడు ముగ్గు పోసుకుంటే పంచాయతీ కార్యదర్శి ఫొటో తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. బ్యాంకు అకౌంట్ నంబర్, స్థలం వారిదా, కాదా అని నిర్ధారించుకున్నాక ఇంటినిర్మాణం మొదలవుతుంది. ఒక్కసారి ఫొటో అప్‌లోడ్ చేశాక నిర్మాణ స్థలం మార్చడానికి వీల్లేకుండా నిబంధనలు పొందుపరిచారు. స్థలం 400 చదరపు అడుగుల(60 గజాలు)కు తగ్గకుండా ఉండాలి. ఇందులోని 45 గజాల్లో ఇంటి నిర్మాణం చేపట్టేలా పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పిస్తున్నారు.
అధికారుల పరిశీలన
ఇంటి నిర్మాణాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిబంధనలకు అనుగుణంగా పనులు జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు. పునాది నిర్మాణం పూర్తయ్యాక మూడు చోట్ల నుంచి లబ్ధిదారుల ఫొటో తీసి కార్యదర్శి యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ఏఈ పరిశీలిస్తారు. నిర్దేశిత స్థలం, బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ అన్నీ సక్రమంగా ఉంటే ఏఈ అప్రూవ్ చేయాలి. ఇదే సమయాన ఇల్లు ఎంత స్థలంలో నిర్మిస్తున్నారు, బెడ్‌రూం, వంట గది వేర్వేరుగా ఉన్నాయా, లేదా అని గుర్తించాక మేసీ్త్ర ఫోన్ నంబర్, పేరు అప్‌లోడ్ చేస్తే డీఈ లాగిన్‌లోకి వెళ్తుంది. ఇక్కడ నుంచి బేస్‌మెంట్ లెవెల్, స్లాబ్, ఇల్లు పూర్తయ్యే వరకు పర్యవేక్షించి పీడీ లాగిన్‌కు చేరవేస్తారు. పీడీ సూపర్ చెకింగ్ తర్వాత కలెక్టర్‌కు, అక్కడ నుంచి గృహ నిర్మాణ శాఖ ఎండీ లాగిన్‌కు వెళ్తే అన్నీ పరిశీలించి దశల వారీగా నిధులు జమ చేస్తున్నారు.
నిర్మాణాల పూర్తిపై దృష్టి
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లుగానే, నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయించేలా ప్రభు త్వం సూచనలు చేస్తోంది. కొందరు నిరుపేద లబ్ధి దారులు ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలు ప్రారంభించడం లేదు. దీంతో అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు. ఇలా ప్రతీ అంశంలో ప్రత్యేక శ్రద్ధతో ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం అయ్యేలా యంత్రాంగం ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై యంత్రాంగం దృష్టి
జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోంది. అర్హులను గుర్తించి మంజూరు పత్రాలు
ఇవ్వడమే కాక నిర్మాణం పూర్తిచేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురైతే పరిష్కార మార్గాలను చూపిస్తున్నారు. అంతేకాక నిర్మాణ వివరాలను ఎప్పటికప్పుడు ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేసి దశల వారీగా బిల్లులు
మంజూరు చేయిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం