
నూతన సబ్‌స్టేషన్లతో మెరుగైన విద్యుత్ సరఫరా
తల్లాడ: అంతరాయాలు లేకుండా, మెరుగైన విద్యుత్ సరఫరా చేసేలా అవసరమైన చోట విద్యుత్ సబ్‌స్టేషన్లు నిర్మిస్తున్నట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. తల్లాడ మండలం అన్నారుగూడెంకు 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు కాగా, సోమవారం ఆయన స్థలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ స్థానిక రైతులు, నాయకులతో చర్చించి ప్రతిపాదించిన స్థలాల వివరాలు చర్చించారు. కొత్త సబ్‌స్టేషన్ ఏర్పాటుతో అన్నారుగూడెం, గోపాలపేట, నరసింహారావుపేట, బాలపేట, ఏన్కూరు మండలం గార్లొడ్డు గ్రామాల కు ఉపయోగం ఉంటుందని తెలిపారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ రాంబాబు, డీఈలు ఎల్.రాములు, భద్రుపవార్, కృష్ణారావు, దాసు, ఏడీఈలు సతీష్, ఖాదర్‌బాబా, ఏఈలు రాయల ప్రసాద్, కవిత, రైతులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల్లో
పౌష్టికాహారం
వేంసూరు: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూ పోషణ లోపం నివారణకు కృషి చేస్తున్నామని ఐసీడీఎస్ వరంగల్ ఆర్‌జేడీ ఝాన్సీలక్ష్మీబాయి తెలిపారు. ఈమేరకు లబ్ధిదారులు అంగన్‌వాడీల్లో సేవలను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. వేంసూరు మండలం కొండెగట్ల కేంద్రంలో గురువారం పౌషణ మాసోత్స వం సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా పోషకాలతో కూడిన ఆహారం ఆవశ్యకతపై ఆర్‌జేడీ అవగా హన కల్పించారు. అలాగే, ప్రతిజ్ఞ చేయించారు. సీడీపీఓ మెహరున్సీసా బేగం, సూపర్‌వైజర్ భవాని, అంగన్‌వాడీ టీచర్లు కరుణ, నాగలక్ష్మి, పద్మ, చంద్రకళ, వాణి, జయ పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి
ఖమ్మంక్రైం: జోన్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురికి ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఇందులో ఖమ్మం కమిషనరేట్‌కు కేటాయించిన ఉద్యోగులు సోమవారం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీపీ పదోన్నతితో పాటు బాధ్యతలు పెరగనున్నందున చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. అడిషనల్ డీసీపీ రామానుజం తదితరులు పాల్గొన్నారు.

నూతన సబ్‌స్టేషన్లతో మెరుగైన విద్యుత్ సరఫరా

నూతన సబ్‌స్టేషన్లతో మెరుగైన విద్యుత్ సరఫరా