
పలు రైళ్ల రద్దు
● పది రైళ్లకు 18వ తేదీ వరకు బ్రేక్ ● మూడో లైన్ పనులతో నిర్ణయం
ఖమ్మంరాపర్తినగర్: జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పాపటపల్లి – డోర్నకల్ మార్గంలో మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకున్నారు. పలు రైళ్లను మంగళవారం నుంచి ఈనెల 18 వరకు రద్దు చేయగా, ఇంకొన్నింటిని మాత్రం నిర్ణీత తేదీల్లోనే నడిపిస్తారు. అలాగే, ఆదిలాబాద్ – తిరుపతి(17406) కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈనెల 16, 17 తేదీల్లో రీ షెడ్యూల్ చేశారు. తద్వారా రైలు గంటన్నర ఆలస్యంగా నడుస్తుంది.
రద్దయిన రైళ్ల వివరాలు
కాజీపేట – డోర్నకల్ మార్గంలో ఇరువైపులా రాకపోకలు సాగించే(67765, 67766) ప్యాసింజర్‌ను ఈనెల 18వ తేదీ వరకు రద్దు చేశారు. అలాగే, డోర్నకల్ – విజయవాడ(67767, 67768), విజయవాడ – కొత్తగూడెం (67215, 67216) ప్యాసింజర్లతో పాటు గుంటూరు – సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ (12705, 12706), విజయవాడ – సికింద్రాబాద్ (12713, 12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 18వ తేదీ వరకు ఇరువైపులా రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అంతేకాక కోర్బా –కూచ్‌వెలి (22647) ఎక్స్‌ప్రెస్‌ను 15, 18వ తేదీల్లో, కూచ్‌వెలి – కోర్భా ఎక్స్‌ప్రెస్ (22648)ను ఈనెల 13, 16వ తేదీల్లో, గోరఖ్‌పూర్–కూచ్‌వెలి (12511) ఎక్స్‌ప్రెస్‌ను 10, 12వ తేదీల్లో, కూచ్‌వెలి – గోరఖ్‌పూర్ (12512) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీన, బరౌని – ఎర్నాకులం (12521) ఎక్స్‌ప్రెస్‌ను 13న, ఎర్నాకులం – బరౌని ఎక్స్‌ప్రెస్ (12522)ను 17వ తేదీన రద్దు చేశారు. అంతేకాక విశాఖపట్నం – న్యూఢిల్లీ (20805) ఎక్స్‌ప్రెస్‌ను 16, 17న, తిరుగు ప్రయాణం(20806)లో 16న, విశాఖపట్నం – గాంధీగమ్ (20803) ఎక్స్‌ప్రెస్‌ను 16న, తిరుగు ప్రయాణం(20804)లో 19వ తేదీన, గుంటూరు – సికింద్రాబాద్ (17201) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 18వరకు, తిరుగు ప్రయాణం (17202)లో ఈనెల 17వ తేదీ వరకు, షాలిమర్ – చర్లపల్లి రైలును రెండు మార్గాల్లో (18045, 18046) వెళ్లేటప్పుడు 16, 17వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 17, 18వ తేదీల్లో రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక సీఎస్‌టీ ముంబై– భువనేశ్వర్ (11019) రైలును 16, 17వ తేదీల్లో, భువనేశ్వర్ – సీఎస్‌టీ ముంబై (11020) రైలును 17, 18వ తేదీల్లో, సాయినగర్ షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్(17205)ను 16న, కాకినాడ – సాయినగర్ షిర్డీ (17206) ఎక్స్‌ప్రెస్‌ను 18వ తేదీన దారి మళ్లించి నడిపించనున్నాఉ.