
పలు ప్రాంతాల్లో వర్షం
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 11గంటల సమయాన భారీ శబ్దాలతో మెరుపులు, ఉరుములకు తోడు వర్షం మొదలైంది. కాగా, ఖమ్మంతో పాటు పలు గ్రామాల్లో పిడుగులు పడడంతో ని ఇళ్లలో విద్యుత్ ఉపకరణాలు కాలిపోయాయి. ఖమ్మం, పాలేరు డివిజన్లలో ఓ మోస్తరు వర్షపాతం నమోదుకాగా, సోమవారం ఉదయం కూడా కొన్నిచోట్ల వర్షం కురిసింది. రఘునాథపాలెంలో అత్యధికంగా 56 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, తిరుమలాయపాలెంలో 30.8, నేలకొండపల్లిలో 23.2, ముదిగొండలో 17,2, పెనుబల్లిలో 13.2, ఖమ్మం రూరల్‌లో 11.2 మి.మీ., సోమవారం సత్తుపల్లి మండలం సదాశివునిపాలెంలో 47 మి.మీ.లు, వేంసూరులో 35, సత్తుపల్లి మండలం గంగారంలో 22.3, సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ వద్ద 19.8, సత్తుపల్లిలో 18 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా, భారీ వర్షంతో చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పంటకు నష్టం ఎదురవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరకొరగా చెట్లపై ఉన్న పత్తి రంగు మారుతుండగా ధర పడిపోతుందని చెబుతున్నారు.