
రెండు పాడిగేదెల చోరీ
బోనకల్: మండలంలోని కలకోటలో గుర్తుతెలియని వ్యక్తులు రెండు పాడి గేదెలను చోరీ చేశారు. గ్రామానికి చెందిన తోటపల్లి గురవయ్య ఆదివారం రాత్రి తన గేదెలను ఇంటి ముందు కట్టేశాడు. సోమవారం ఉదయంకల్లా రూ.1.50లక్షల విలువైన గేదెలు లేకపోవడంతో చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మున్నేటి వరదలో చిక్కుకున్న ట్రాక్టర్లు
ముదిగొండ: మండలంలోని పెద్దమండవ మున్నేటిలో సోమవారం ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో తీసుకొచ్చేందుకు వెళ్లిన మూడు ట్రాక్టర్లు సహా డ్రైవర్లు చిక్కుకున్నారు. నీటి ప్రవాహం పెరుగుతుండగానే కూలీలు అప్రమత్తమై పరుగుపరుగున ఒడ్డుకు చేరారు. అప్పటికే ట్రాక్టర్ల ఇసుక లోడు చేసి ఉన్నా బయటకు తీసుకురాలేక డ్రైవర్లు సైతం బయటకు వచ్చారు. దీంతో వరద ప్రవాహంలోనే మూడు ట్రాక్టర్లు నిలిచిపోయాయి. కాగా, మున్నేటి ఉధృతితో ముదిగొండ మండలం పండ్రేగుపల్లి – చింతకాని మండలం రామకృష్టాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
విద్యుదాఘాతంతో దుక్కిటెడ్లు మృతి
కారేపల్లి: స్తంభానికి విద్యుత్ సరఫరా కావడంతో దాన్ని తాకిన రెండు దుక్కిటెడ్లు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. కారేపల్లి మండలం తొడితలగూడెంకు చెందిన రైతు శ్యాంలాల్ సాహు తన చేనులో ఉన్న విద్యుత్ స్తంభానికి రెండు ఎద్దులను కట్టివేశాడు. ఈక్రమాన వర్షం రావడంతో స్తంభానికి విద్యుత్ సరఫరా కాగా ఎడ్లు షాక్‌కు గురైన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.2లక్షల విలువైన దుక్కిటెడ్ల మృతితో జీవనాధానం కోల్పోయినందున తమ కుటుంబాన్ని ఆదుకోవాలని శ్యాంలాల్ కోరాడు. ఈవిషయమై విద్యుత్ సిబ్బంది స్పందించాలని స్థానికులు విన్నవించారు. అలాగే, ఇలాంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షించాలని కోరారు.

రెండు పాడిగేదెల చోరీ