
● మా పరిస్థితి ఏమిటి సార్?
నిరుపేదలు, తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్)ను
ప్రవేశపెట్టి ప్రైవేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తోంది. అయితే, గత రెండున్నరేళ్ల నుంచి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో నిర్వహణ భారంగా మారిందంటూ పాఠశాలల
యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. దసరా
సెలవుల అనంతరం కొన్నిచోట్ల విద్యార్థులను అనుమతించకపోవడంతో తల్లిదండ్రులు
నచ్చచెప్పి చేర్పించారు. ఈనేపథ్యాన బీఏఎస్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులతో
తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి తమ గోడు వివరించారు. బకాయిలు విడుదల చేసి పిల్లల చదువుకు ఆటంకం రాకుండా చూడాలని కోరారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్