
అటవీ ఉద్యోగుల క్రీడలు షురూ..
చుంచుపల్లి: రెండు రోజుల పాటు నిర్వహించనున్న అటవీ శాఖ ఉద్యోగుల జోనల్ స్థాయి క్రీడా పోటీలను కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో సీసీఎఫ్ భీమానాయక్ శుక్రవారం ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉద్యోగులకు 800 మంది అథ్లెటిక్స్, వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, షటిల్, రన్నింగ్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. తొలిరోజు కబడ్డీ, షటిల్, రన్నింగ్, వాలీబాల్, క్రికెట్ పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ప్రారంభం సందర్భంగా భీమానాయక్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని అన్నారు. అటవీ, పర్యావరణ పరిరక్షణలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని చెప్పారు. ఇదే సమయాన క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో చురుగ్గా పాల్గొని ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ జిల్లాల డీఎఫ్‌ఓలు, ఎఫ్‌డీఓలు, డీఆర్‌ఓలు, రేంజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
హైవే సర్వే అడ్డగింత
రఘునాథపాలెం: మండలంలోని వి.వెంకటాయపాలెం పరిధిలో నేషనల్ హైవే నిర్మాణానికి సర్వే కోసం అధికారులు శుక్రవారం వచ్చారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో మొక్కలు, బావులు తదితర ఆస్తుల వివరాల నమోదుకు రావడంతో స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఈ విషయమై ప్రస్తుతం హైకోర్టు స్టే ఉన్నందున సర్వే చేయొద్దని తెలిపారు. ఈమేరకు రైతుల ఆందోళనతో అధికారులు వెనుదిరిగారు.
యూరియా అమ్మకాలపై డీఏఓ ఆరా
మధిర: మధిర మండలం మాటూరు రైతు వేదికలో యూరియా అమ్మకాలను జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య శుక్రవారం పరిశీలి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా క్లస్టర్ స్థాయిలోనే యూరియా అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మధిర సొసైటీ కింద ఎక్కువ గ్రామాలు ఉన్నందున సబ్ సెంటర్ ఏర్పాటుచేశామని తెలిపారు. కాగా, రైతులు నానో యూ రియా, నానో డీఏపీపైనా దృష్టి సారించాలని డీఏఓ సూచించారు. మండల వ్యవసాయ అధికారి సాయిదీక్షిత్, ఏఈఓలు పాల్గొన్నారు.
రిజర్వేషన్లకు చట్టబద్ధతలో ప్రభుత్వ వైఫల్యం
ఖమ్మంవైరారోడ్: బీసీ రిజర్వేషన్లకు చట్ట బద్ధత సాధించడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల హక్కులు, అవకాశాలను రక్షించాల్సి ఉండగా, ఎంపీలు రిజర్వేషన్లపై ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదని తెలి పారు. కాంగ్రెస్, బీజీపీ పార్టీల ద్వంద వైఖరితో ఈ పరిస్థితి ఏర్పడినందున పార్లమెంట్‌లో చట్టం ద్వారా రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆయన సూచించారు.