ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

Oct 11 2025 9:24 AM | Updated on Oct 11 2025 9:24 AM

ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

ఇద్దరిని బలిగొన్న రోడ్డు ప్రమాదం

● బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన ● బాలుడు, బాలిక మృతి ● మరొకరికి గాయాలు

● బైక్‌ను ట్రాక్టర్‌ ఢీకొట్టడంతో ఘటన ● బాలుడు, బాలిక మృతి ● మరొకరికి గాయాలు

ముదిగొండ : మండలంలోని పెద్దమండవ – బాణాపు రం రహదారిలో బైక్‌ను ట్రాక్టర్‌ ఢీ కొట్టిన ప్రమాదంలో ఓ బాలుడు, బాలిక మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్దమండవ గ్రామానికి చెందిన పేరం ప్రవీణ్‌(13), గొర్రెముచ్చు సనా(10), గొర్రెముచ్చు సాయి బైక్‌పై ఖమ్మం వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పేరం ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సనా, సాయిని ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సనా ప్రాణాలు కోల్పోయింది. కాగా, ఆ రహదారిలో మామిడి మొద్దులు ఉండగా వాటికి బైక్‌ను ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని కొందరు చెబుతుండగా, ప్రవీణ్‌ కుటుంబసభ్యులు మా త్రం ట్రాక్టర్‌ ఢీ కొట్టడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అంటున్నారు. దీనిపై సీఐ మురళిని వివరణ కోరగా సెల్ఫ్‌యాక్సిడెంట్‌ జరిగి ఉండొచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement